మరోసారి అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు సాక్ష్యాలతో సహా ..!

వాస్తవం ప్రతినిధి: 2014 ఎన్నికల్లో అబద్ధపు హామీలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ని కి 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు దిమ్మతిరిగి పోయే విధంగా తీర్పునిచ్చారు. ఇటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కి భవిష్యత్తు లేకుండా ఏపీ ప్రజలు తీర్పు ఇవ్వడంతో పార్టీని నిలబెట్టడానికి నానా తంటాలు పడుతున్నారు పార్టీ అధ్యక్షులు చంద్రబాబు. ఇటువంటి నేపథ్యంలో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం పై బురదజల్లడానికి చంద్రబాబు చేసిన కుయుక్తులు సాక్షాలతో సహా అడ్డంగా దొరికిపోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. విషయంలోకి వెళితే..

ఇటీవల ఆంధ్రరాష్ట్రంలో తీవ్ర వర్షాల కారణంగా కృష్ణా నదీ జలాలు ముంపు ప్రాంతాలను ముంచేసిన సంగతి అందరికి తెలిసిందే. దీనితో ఈ అంశాన్ని అడ్డు పెట్టుకొని టీడీపీ వైసీపీపై ప్రజల్లో ఎంతటి వ్యతిరేకత ఉందో చూపిద్దామని ఒక ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయారు. ఇన్ని వరదలు వస్తున్నా సరే అధికార పార్టీ తమను పట్టించుకోవడం లేదని ఒక రైతు వీడియోను తీసుకొచ్చి టీడీపీ తమ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసింది.

ఇదే క్రమంలో మరో పక్క ఒక మహిళ కూడా జగన్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ పోస్ట్ చేయడం వారంతా అసలు వరద బాధితులు కారని తెలుగుదేశం పార్టీ కి చంద్రబాబు కి సంబంధించిన పెయిడ్ ఆర్టిస్టులని ఎన్నికల సమయంలో టిడిపి పార్టీ తరఫున వచ్చిన ప్రచార కార్యక్రమాల్లో ఉన్నవారేనని బయట పడిపోయింది. దీంతో చంద్రబాబు అడ్డంగా దొరికి పోయారు. మరోపక్క ఈ వీడియోలను వైసిపి పార్టీ అప్పటి ఎన్నికల వీడియో ఇప్పుడు వరదబాధితుల వీడియో అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి చంద్రబాబు ఆడిన డ్రామా గేములు మొత్తం బయటపెట్టడంతో…చంద్రబాబు పై సోషల్ మీడియాలో నెటిజన్ల విమర్శల వర్షం కురిపిస్తున్నారు.