బీజేపీకి ఎదురువెళ్లేవాడు ఎవడు? చిదంబరం అరెస్టు?

 వాస్తవం ప్రతినిధి: ఎవరు తీసిన గోతిలో వారే పడతారు అన్నట్లు ఇప్పుడు చిదంబరం పరిస్థితి మారింది. గతంలో సీబీఐ, ఈడీలు అడ్డంపెట్టుకుని కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థులపై అనవసరమైన కేసులు పెట్టి రాజకీయంగా ఇబ్బందుల పాలు చేయడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం లో బిజెపి పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిదంబరాన్ని అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేసినట్లు వార్తలు వినపడుతున్నాయి. విషయంలోకి వెళితే

గతంలో ఐఎన్ఎక్స్ మీడియాలోకి మూడు వందల కోట్ల రూపాయలకు పైగా విదేశీ పెట్టుబడులు వచ్చిన వ్యవహారంలో చిదంబరం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే అభియోగాలను సీబీఐ, ఈడీలు నమోదు చేశాయి. ఈ వ్యవహారంపై రెండేళ్లుగా విచారణ సాగుతూ ఉంది. అప్పటి నుంచి ముందస్తు బెయిల్ పిటిషన్లలోనే చిదంబరం నిమగ్నమయ్యారు. ఇప్పుడు ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. ఈ పరిణామంతో చిదంబరం అరెస్టయి ఖచ్చితంగా కొన్ని రోజుల్లో జైలుకు వెళ్ళటం ఖాయమనే అభిప్రాయాలు చాలా బలంగా వినిపిస్తున్నాయి. ఇదే విషయంలో చిదంబరం కొడుకు కార్తీ కూడా న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కార్తీక పై కూడా సిబిఐ ఈడీల విచారణ కొనసాగుతూ ఉంది. ఇటువంటి నేపథ్యంలో ముందస్తు బెయిల్ కి అప్లై చేసినా గాని ఢిల్లీ హైకోర్టు చిదంబరానికి షాక్ ఇచ్చింది. బెయిల్ పిటిషన్ ను పరిగణలోకి తీసుకోకుండా ఢిల్లీ హైకోర్టు విచారణకు సహకరించాలని చిదంబరానికి సూచించింది. మొత్తంమీద పరిణామాలు చూస్తుంటే తొందర్లోనే చిదంబరం అరెస్ట్ ఖాయం అనే వార్తలు వినపడుతున్నాయి. ఇదే క్రమంలో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉన్న సమయంలో చిదంబరం బీజేపీ పార్టీ కి చెందిన అనేక మందిని అనేక రకాలుగా ఇబ్బందులు పాలు చేయడం జరిగింది..ఇటువంటి క్రమంలో బిజెపి పార్టీ తనకు ఎదురుగా వచ్చిన ప్రతి ఒక్కరిని ఎదురులేకుండా తనదైన శైలిలో ఇబ్బందులపాలు చేస్తున్నట్లు చిదంబరం విషయం బట్టి అర్థమవుతోంది.