కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం అరెస్ట్ కు మార్గం సుగమం

వాస్తవం ప్రతినిధి: కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం ఏ క్షణంలోనైనా అరెస్టయ్యే అవకాశాలున్నాయి. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో చిదంబరం ముందస్తు బెయిల్‌కు ఢిల్లి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ముందస్తు బెయిల్‌ను తిరస్కరించింది. దీనితో చిదంబరం అరెస్టుకు మార్గం సుగమమైంది. కాగా ఢిల్లి హైకోర్టు తీర్పుపై చిదంబరం సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు.