రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా వీర్‌భూమి వద్ద ప్రముఖుల నివాళులు

వాస్తవం ప్రతినిధి: దేశ వ్యాప్తంగా మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 75వ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా వీర్‌భూమి వద్ద ప్రముఖులు నివాళులర్పించారు. రాజీవ్‌గాంధీకి ఆయన సతీమణి సోనియాగాంధీ, మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, తనయుడు రాహుల్‌గాంధీ, కుమార్తె ప్రియాంకగాంధీ అంజలి ఘటించారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు ఆజాద్‌, అహ్మద్‌ పటేల్‌లు, నేతలు కూడా రాజీవ్‌గాంధీ స్మృతి సమాధి వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజీవ్‌ చేసిన సేవలను నేతలు స్మరించుకున్నారు.