చివరికి ఇండియా-పాక్ మధ్య మధ్యరికం జరిపిన ట్రంప్..!

వాస్తవం ప్రతినిధి: అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత ప్రధాని మంత్రి నరేంద్ర మోడీతో ఫోనులో ముచ్చటించారు. దాదాపు అరగంట సేపు వీరిద్దరి మధ్య సంభాషణ జరిగింది. ఈ సందర్భంగా వీరిద్దరి సంభాషణలో ఎక్కువగా కాశ్మీర్ అంశంపై చర్చ జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో పాకిస్తాన్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ తో పాటు ఇంకా చాలామంది నేతలు భారత్ కి వ్యతిరేకంగా ఉన్నారని మోడీ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఇటీవల జూన్ నెలాఖరులో ఒసాకాలో జరిగిన జీ20 సదస్సులో రెండు దేశాలకు మధ్యన వచ్చినటువంటి చర్చలను కూడా ప్రధాని మోడీ ట్రంప్ కి వివరించారు. వీటితోపాటు రెండు దేశాల మధ్యన ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. ఇటువంటి నేపథ్యంలో భారత ప్రధాని కార్యాలయం వీరిద్దరి సంభాషణ గురించి ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. భారత ప్రధాని మోడీ మరియు అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ మధ్య స్నేహపూర్వకమైన చర్చ జరిగిందని పేర్కొన్నారు. అంతే కాకుండా ఇటీవల కాశ్మీర్ విషయంలో భారత్ ప్రభుత్వం ఆర్టికల్ 370 ని రద్దు చేసిన నిర్ణయాన్ని వ్యతిరేకించిన పాకిస్థాన్, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తో సంప్రదించారు. కాగా ఈ విషయంపై వీరిరువురు కూడా ఫోనులో చర్చలు జరిపారని సమాచారం.