బీజేపీకి తెలంగాణాలో అతి పెద్ద ఊరట కలిగించే విషయం ఇదే..!

వాస్తవం ప్రతినిధి: దక్షిణాదిలో ఎలాగైనా విస్తరించాలని చూస్తున్న బీజేపీ పార్టీ కర్ణాటకలో జె డి ఎస్- కాంగ్రెస్ పార్టీ మిత్ర బంధం తో ఉన్న ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని సంపాదించింది. ఇప్పుడు ఇదే క్రమంలో తెలంగాణలో కూడా అదే జోరు కొనసాగించడానికి రెడీ అయ్యింది. మొన్న పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ బలంగా ఉండే కొన్ని స్థానాలను గెలుచుకున్న బీజేపీ పార్టీ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సమస్య నాయకులను టార్గెట్ చేస్తూ తమ పార్టీలోకి చేర్చుకోవడానికి ఇప్పటికే ప్రయత్నాలు జరిగింది. ఈ విధంగా అధికార పార్టీ టిఆర్ఎస్ కి చుక్కలు చూపిస్తున్న బిజెపి పార్టీ గ్రేటర్ హైదరాబాద్ లో టిఆర్ఎస్ పార్టీ బలహీనంగా ఉన్న చోట బిజెపి పార్టీ గ్రేటర్లో నిలదొక్కుకోవడానికి రెడీ అవుతుంది. పార్లమెంటు ఎన్నికలు జరిగిన తర్వాత గ్రేటర్ పరిధిలో ఉండే టిఆర్ఎస్ పార్టీ నాయకులు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా సరిగ్గా సీరియస్ గా తీసుకోవడం లేదు. మరోపక్క పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభ్యత్వ నమోదును గడుపులోపు పూర్తి చేయించాలని నగర మంత్రులను ఆదేశించారు. ముఖ్యంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణం ఆ పార్టీకి చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు అని పార్టీ లో టాక్ వినపడుతుంది. ఎందుకంటే గతంలో గ్రేటర్ ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి కార్పోరేటర్లకు డివిజన్ల అభివృద్ది కోసం నిధులు కేటాయించలేదు. డివిజన్లలో కూడా ఎమ్మెల్యేలే పెత్తనం చెలాయిస్తున్నారు. సభ్యత్వాలను చేయించాలంటే ఆర్దికంగా భారం తమమీదే పడుతుందనే భయం కూడా కార్పొరేటర్లలో ఉంది.ఈ కారణాలన్నింటితో కార్పొరేటర్లు లైట్ తీసుకుంటున్నారు. దీంతో ఇప్పుడు బిజెపి పార్టీ ఇటువంటి పరిస్థితిలో ఉన్న చోట బిజెపి పార్టీ విస్తరించడానికి బలపడటానికి సరైన ప్లాన్ వేసినట్లు తెలంగాణ బిజెపి లో టాక్ వినబడుతోంది.