అరుణ్ జైట్లీని పరామర్శించిన బీజేపీ అగ్ర నేత ఎల్ కె అద్వానీ

వాస్తవం ప్రతినిధి: తీవ్ర అనారోగ్యంతో ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీని బీజేపీ అగ్ర నేత ఎల్ కె అద్వానీ పరామర్శించారు. వైద్యులను ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. జైట్లీ ప్రస్తుతం వెంటిలేటర్ మీద ఉన్నారు. ఇప్పటికే అనేకమంది నేతలు, మంత్రులు జేట్లీని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.