రజనీకాంత్ కు బీజేపీ బంపర్ ఆఫర్..?

వాస్తవం ప్రతినిధి: సూపర్ స్టార్ రజనీకాంత్ ను ఆకర్షించేందుకు బీజేపీ ఎప్పటి నుంచో యత్నిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయనకు బీజేపీ చీఫ్ అమిత్ షా బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. బీజేపీలో చేరితో తమిళనాడు పార్టీ పగ్గాలను అప్పగించడమే కాకుండా… ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ప్రకటిస్తామని అమిత్ షా చెప్పినట్టు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ వార్తలతో తమిళనాడు రాజకీయాలు సరికొత్త మలుపు తిరిగాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేలా ప్రధాని మోదీ, అమిత్ షాలు వ్యూహరచన చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలపై వారు మరింత ఫోకస్ చేస్తున్నారు.