న్యూజిలాండ్‌పై శ్రీలంక విజయం !

వాస్తవం ప్రతినిధి: రెండు టెస్టు సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య శ్రీలంక ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్‌ నిర్దేశించిన 268 పరుగుల లక్ష్యంను లంక నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్‌ దిముత్‌ కరుణరత్నే (122; 243 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్‌) సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొదటి టెస్టులో లంక విజయం సాధించి సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆఖరి రోజు ఆటలో 133/0 ఓవర్‌ నైట్‌ స్కోరుతో ఓపెనర్లు కరుణరత్నే, తిరిమన్నేలు లంక ఇన్నింగ్స్‌ను కొనసాగించారు. నాలుగో రోజు కివీస్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్న ఈ జోడి.. చివరి రోజు కాస్త తడబడ్డారు. 161 పరుగులు జోడించిన తర్వాత తిరిమన్నే (64) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. సోమర్‌విల్లే ఈ జంటను విడదీసాడు. అనంతరం 13 పరుగుల వ్యవధిలో కుశాల్‌ మెండిస్‌ (10) ఔటవడంతో క్రీజులోకి వచ్చిన ఏంజెలో మాథ్యూస్‌ ఆచితూచి ఆడాడు.