దేవరకొండకి మళ్లీ కోపం వచ్చింది ..!

వాస్తవం ప్రతినిధి: గతంలో తనపై అనేక వార్తలు వచ్చిన సందర్భంలో కోపం ప్రదర్శించిన విజయ్ దేవరకొండ కి తాజాగా మరొకసారి కోపం వచ్చింది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న విజయ్ దేవరకొండ కి డియర్ కామ్రేడ్ సినిమా ఊహించని షాక్ ఇచ్చింది. భారీ అంచనాల మధ్య భారీగా ప్రమోషన్ కార్యక్రమాలు చేసిన సినిమా అట్టర్ ప్లాప్ అవడంతో కావాలనే సోషల్ మీడియాలో ఒక వర్గానికి చెందిన వాళ్లు విజయ్ దేవరకొండ ని టార్గెట్ చేసి నెగిటివ్ పబ్లిసిటీ ప్రచారం చేయడంతో అప్పట్లో ఇండస్ట్రీలో చాలా వార్తలు ఈ సినిమా పై వచ్చాయి. కావాలని విజయ్ దేవరకొండ ఎదుగుదలను ఓర్చుకోలేని ఓ వర్గం చాలా దారుణంగా డియర్ కామ్రేడ్ సినిమా ఫ్లాప్ అయినప్పుడు వ్యవహరించినట్లు అనేక ఆరోపణలు అప్పట్లో వినపడ్డాయి. ఇదే క్రమంలో హీరో విజయ్ దేవరకొండ ఈ విషయంపై స్పందించాడు. ఇదంతా తాను గమనిస్తున్నానని దురదృష్టవశాత్తు ఇలాంటి పోకడ తెలుగు పరిశ్రమలో ఉండటం విచారం కలిగిస్తోందని చెప్పాడు. వీటి నుంచి బయటికి వచ్చి అతీతంగా నిలిచే స్థాయికి తప్పకుండా చేరుకుంటానన్న నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. డియర్ కామ్రేడ్ ఫలితాన్ని అంగీకరించిన విజయ్ ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కెఎస్ రామారావు నిర్మిస్తున్న మూవీ మీదే ఫోకస్ పెడుతున్నాడు. ఇటీవలే బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన పూరితో చేయబోతున్నట్టు అఫీషియల్ గా ప్రకటించి ఫ్యాన్స్ కు ఈ రూపంలో మాస్ కిక్ ఇచ్చాడు. ఇప్పటిదాకా లవ్ ను బేస్ చేసుకున్న కథలతోనే వచ్చిన విజయ్ దేవరకొండకు పూరి సరికొత్త మాస్ ఇమేజ్ తెస్తాడని వాళ్ళ నమ్మకం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.