రజినీ సార్.. ఆలస్యం.. అమృతం.. విషం..!

వాస్తవం ప్రతినిధి: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా అత్యంత క్రేజ్ ఉన్న హీరో ఎవరైనా ఉన్నారంటే రజినీకాంత్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా సౌత్ ఇండియాలో రజనీకాంత్ సినిమాలు దుమ్ము దులిపే కలెక్షన్లు రాబడుతూ చాలా రికార్డులు సృష్టిస్తాయి. ఇటువంటి నేపథ్యంలో రాజకీయాల్లో అడుగుపెట్టిన రజినీకాంత్…క్రియాశీల రాజకీయాల్లో చాలా ఆలస్యంగా అడుగు వేస్తూ తప్పు చేస్తున్నట్లు రజినీకాంత్ కి అర్థం అవుతున్నట్లు తెలుస్తుంది. వీలైనంత త్వరగా పార్టీని ప్రకటించి ప్రజల్లో విస్తృతంగా పర్యటించి పార్టీని బలోపేతం చేయాల్సింది పోయి, మీనమేషాలు లెక్కపెడుతూ, సరిగ్గా ఎన్నికలకు ఏడాది ముందు ప్రజలలోకి వచ్చి హంగామా చేయాలని భావిస్తే ప్రజలు పార్టీని తిరస్కరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇటీవల ఈ విషయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తేలింది. ఇటువంటి నేపథ్యంలో తమిళ రాజకీయాల్లో రజనీకాంత్ ను అనుసరిస్తున్న విధానం చూస్తుంటే పూర్తిగా బిజెపి అనుకూల పార్టీగా ముద్ర పడడం ఖాయమని అవకాశాలు కనిపిస్తున్నాయి. క్యాడర్ పరంగా బలంగా ఉన్న మరో రెండు పార్టీల మధ్య తన పార్టీని బలోపేతం చేసుకోవడానికి రజనీకాంత్ కి ఈ సమయం సరిపోదనే విశ్లేషణ బలంగా వినిపిస్తుంది. మొత్తం మీద సోషల్ మీడియాలో రజనీకాంత్ అభిమానులు పొలిటికల్ జర్నీ గురించి రజనీ సార్ తొందరగా నిర్ణయాలు తీసుకుంటే మంచిది లేకపోతే ఆలస్యం అమృతం విషం అయిపోతుందని..మరో రెండు నెలల్లో ఎన్నికల వస్తున్నట్లు కామెంట్లు చేస్తున్నారు.