రెజ్లర్ బజ్‌రంగ్‌ పునియా ఖూ రాజీవ్‌ గాంధీ ఖేల్‌రత్న అవార్డు

వాస్తవం ప్రతినిధి: రెజ్లర్ బజ్‌రంగ్‌ పునియా రాజీవ్‌ గాంధీ ఖేల్‌రత్న అవార్డుకు నామినేట్‌ అయ్యాడు. బజ్‌రంగ్‌ (65 కేజీ) గత ఏడాది ఆసియా క్రీడలు, కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించాడు. జస్టిస్‌ (రిటైర్డ్‌) ముకుందకమ్‌ శర్మ నేతృత్వంలోని కమిటీ శుక్రవారం అతడి పేరును ఖరారు చేసింది. పునియాతో పాటు మరో అథ్లెట్‌ను కూడా ఖేల్‌రత్నకు ఎంపిక చేసే అవకాశముందన్నట్టు తెలుస్తోంది. బైచుంగ్‌ భుటియా, మేరీకోమ్‌ కూడా సభ్యులుగా గల ఈ కమిటీనే అర్జున, ద్రోణాచార్య అవార్డీలను కూడా ఎంపిక చేయనుంది.