ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

వాస్తవం ప్రతినిధి: కర్నాటకలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందడం కలకలం రేపింది. చామరాజనగర్ జిల్లా గుండ్లుపేట్ లో ఓ వ్యక్తి తన నలుగురు కుటుంబ సభ్యులను కాల్చిచంపి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్థిక నష్టాలు, అప్పుల భారమే ఈ కుటుంబాన్ని బలిగొన్నట్టు చామరాజనగర్ పోలీసులు భావిస్తున్నారు. ఓంకార్ ప్రసాద్ మృతదేహం వద్దే తుపాకి ఉండడంతో… అతడే తన తల్లిదండ్రులు నాగరాజ్ భట్టాచార్య ,హేమలత, భార్య నికిత,కుమారుడు ఆర్య కృష్ణను కాల్చిచంపినట్టు అనుమానిస్తున్నారు. వారిని చంపి అతడు కూడా అదే గన్నుతో ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్నారు.