చిరంజీవి పుట్టిన రోజుని పురస్కరించుకొని అట్లాంటలో మెగా రక్తదాన శిభిరం!

  రక్తానికి మరో ప్రత్యామ్నాయం లేదు. దీనిని ఉత్పత్తి చేయలేము. కానీ దాతలె వరైనా ఉంటే వారినుంచి తీసుకొని అవసరమైన వారికి ఎక్కించి ప్రాణాన్ని కాపాడొచ్చు. అందుకే రక్తదానం ప్రాణదానంతో సమానం

అట్లాంట మెగాభిమానులందరికి విజ్ణప్తి: 

శ్రీ కొణిదెల శివశంకరవరప్రసాద్ (చిరంజీవి) గారు పుట్టిన రోజుని పురస్కరించుకొని ఆగష్టు 18వ తేదిన రక్తదాన శిబిరం మన అట్లాంటలో నిర్వహిస్తున్నాము. అమెరికాలో మెగాభిమానులందరూ చిరంజీవి గారు పుట్టినరోజుని రక్తదానం దినోత్సవంగా గుర్తించి అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో 2017లో సుమారు 53 సెంటర్స్ లో 1000 యూనిట్స్ రక్తదానం చేసారు.

దాతలు విరివిగా పాల్గొని మనం పుట్టిన గడ్డకే కాకుండా, మనం జీవనం సాగిస్తున్న అమెరికలో కూడా మన సేవానిరతిని ప్రదర్శిస్తారు అని భావిస్తున్నాము.

ఎప్పుడు: ఉదయం 8గం|| నుండి మధ్యాహ్నం 2గం|| వరకు, ఆదివారం, 18వ తేది ఆగస్టు 2019
ఎక్కడ: రెడ్ క్రాస్, 3000 ఓల్డ్ అలబామ రోడ్, ఆల్ఫరిటా-30022

ఆశ గొప్పది
అది ఆశయం వైపు పయినిస్తే ఇంకా గొప్పది
ఆ ఆశయం కొన్ని కోట్ల మందికి వెలుగునిస్తే!
అదే మనిషిని మనీషి చేసేది.
ఆమనీషే మన మెగాస్టార్ చిరంజీవి గారు.
ఎదిగేక్రమంలో ఒదుగుతూ ఉండాలి – ఎదిగినకొద్దీ వినయంగా ఉండాలి.
అందుకే ఆయన మేరునగదీరుడైయ్యారు.
కాలంలో కలిసిపోయే అందరూలాగ కాకుండా
కాలచక్రంలో తనపేరుని పదికాలాలపాటూ చిరస్తాయిగా రాసుకొన్న చిరంజీవుడు మన కొణిదెల వరప్రసాద్ గారు.

*రక్తదానం అంటే?*
_రోగ నివారణ కోసం, ప్రమాదాల సమ యంలో, విపత్కర ఆరోగ్య పరిస్థితులో బాధితుల శరీరంలో రక్తం తగినంతగా లేకపోతే మరొకరి నుంచి రక్తాన్ని ఎక్కించాల్సిందే. ఇలా ఒకరి రక్తం మరొకరికి ఇచ్చే పద్ధతిని రక్త దానం అంటారు. రక్తదానం సేవ మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత కూడా.రక్తాన్ని తీసుకొనే వ్యక్తిని గ్రహీత అని, ఇచ్చే వ్యక్తిని దాత అని అంటారు. ఓ గ్రూప్‌ వారిని విశ్వదాత అని, ఎ.బి. గ్రూపుల రక్తం కలిగిన వారిని విశ్వగ్రహీత అని అంటారు._

*ఎవరి నుంచి ఎవరికి?*
_రక్తం అంతా ఒకేలా ఎర్రగా కన్పించినా కొంతమంది రక్తం కొన్ని గ్రూపుల వారికే ఉపయోగపడుతుంది. ఎవరు ఎవరికి రక్తం దానం చేయవచ్చంటే-ఎబి గ్రూప్‌ వారు ఎబి గ్రూప్‌ కి , ఎ గ్రూప్‌ వారు ఎ, ఎబి గ్రూపుల వారికి కి, బి గ్రూప్‌ వారు బి, ఎబి గ్రూపుల వారికి కి, ఓ గ్రూప్‌ వారు ఎ, బి, ఎబి, ఓ గ్రూప్‌ల వారందరికి దానం చేయొచ్చు.
అదే విధంగా ఎవరు ఎవరి నుండి రక్తం తీసుకోవచ్చంటే ఎబి గ్రూప్‌ వారు అన్ని గ్రూపుల వారి నుంచి. బి గ్రూప్‌ వారు బి, ఓ గ్రూపుల వారి నుంచి, ఎ గ్రూప్‌ వారు ఎ, ఓ గ్రూపుల వారి నుంచి, ఓ గ్రూప్‌ వారు ఓ గ్రూప్‌ నుంచి మాత్రమే రక్తం తీసుకోవాలి._

*ఎవరు రక్త దాతలు?*
_ఆరోగ్యంగా ఉండి 16 నుంచి 60 సంవత్సరాలు వయసులోపల ఉన్నవారెవరైనా రక్తదాతలే. 45కేజీల కంటే అధిక శరీర బరువు కలిగిన వారు, రక్తపోటు, నాడీ రేటు, గుండె కొట్టుకునే స్థితి.. సాధారణంగా ఉన్నవారు రక్తాన్ని దానం చేయవచ్చు. ఒక వ్యక్తి ప్రతి 3-4 నెలలకు ఒక్కసారి రక్తాన్ని దానం చేయవచ్చు. 18 ఏళ్లు నిండినవారు జీవిత కాలంలో 168 సార్లు రక్తదానం చేయవచ్చు. ఈ లెక్కన ప్రతిఒక్కరూ 672 మంది ప్రాణాలు కాపాడొచ్చు. రక్తాన్ని సేకరించిన తర్వాత 35-45 రోజులు నిల్వ చేస్తారు. ఈ రక్తాన్ని మూడు రూపాల్లో విభజిస్తారు. రెడ్‌ సెల్స్‌, ప్లాస్మా, ప్లేట్లెట్స్‌ అనే ఈ మూడు రకాలని ముగ్గురికి వారి వారి అవసరాలను బట్టి అందిస్తారు._

*రక్తదానంతో దాతలకూ మేలే!*
_రక్తం అవసరమైనవారికే కాదు దానిని దానం చేసే దాతలకు కూడా ఆరోగ్యకరమైన ప్రయోజనాలున్నాయి. రక్తదాతలకు సాటి మనుషుల ప్రాణాలు కాపాడే అవకాశం దొరుకుతుంది. ఇది సాటిలేని సంతృప్తిని ఇస్తుంది. రక్తదానం చేసేవారిలో గుండెకు సంబంధించిన రోగాలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. తరచూ రక్తదానం చేయడం వల్ల శరీరంలో ఉత్పత్తి అయ్యే ఇనుము శాతం పూర్తి నియంత్రణలో ఉండడమే దీనికి కారణం రక్తదానం కేన్సర్‌ బారిన పడే అవకాశాల్ని దాదాపుగా తగ్గిస్తుంది. రక్తదానం చేసేవారికి తమ శరీరానికి సంబందించిన అనేక రకాలైన రక్త పరీక్షలను పూర్తిగా ఉచితంగా చేసుకునే అవకాశం దొరుకుతుంది. దీనివల్ల రక్తదానం చేసేవారు తమకు తాము ఆరోగ్యవంతులుగా ఉండడానికి తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. రక్తదానం చేయడం వల్ల శరీరంలోని కేలరీలు ఖర్చు అవుతాయి. దీంతో బరువు పెరిగే ప్రమాదం నుంచి సులభంగా తప్పించుకోవచ్చు. కొవ్వు తగ్గుతుంది రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. శరీరం ఫిట్‌గా వుంటుంది. శరీరంలో ఇనుము స్థాయిని సమతుల్యం చేస్తుంది. రక్తంలో ఎక్కువగా ఐరన్‌ ఉంటే గుండెకు హాని చేస్తుంది. కార్డియో వాస్కులర్‌ వ్యాధులను నివారించేందుకు రక్తదానం ఉపకరిస్తుంది. మహిళల్లో ఒక వయస్సు వచ్చిన తర్వాత రుతుస్రావం పూర్తిగా నిలిచిపోయి నప్పుడు (మెనోపాజ్‌ సమయంలో) వారి శరీరంలో నిల్వఉండే ఐరన్‌ స్థాయిని సమతుల్యం చేసుకోవడానికి రక్తదానం చేయడం చాలా మేలు కలిగిస్తుంది. ఎర్ర రక్తకణాల్లో చెడు, మంచి కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించడానికి రక్తదానం చాలా ఉపయోగకరం._

*రక్త దానం అనేది దాదాపు ప్రాణ దానం లాంటిది.. రోగ నివారణ గమ్యంగా పెట్టుకుని ఒకరి రక్తం మరొకరికి ఇచ్చే పద్ధతిని రక్త దానం అంటారు. అన్ని దానాల్లోకెల్లా మిన్న రక్తదానం. ఎందుకంటే… ప్రాణాపాయస్థితిలో వున్న వ్యక్తికి రక్తం ఇచ్చి ప్రాణం కాపాడడమంటే… అంతకన్నా పరోపకారం ఏముంటుంది? అన్నదానం, విద్యాదానమో దానం చేయాలన్నా ప్రాణమున్న మనిషికే చేస్తాం. అలాంటి ప్రాణాలనే నిలబెట్టే మహత్తర దానం రక్తదానం. రక్తదానం సేవ మాత్రమే కాదు, ప్రతి పౌరుడు బాధ్యతగా భావించాలి. సమయానికి రక్తం అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి రక్తదానం చేస్తే మానవత్వమే మీకు పాదాభివందనం చేస్తుంది…*

_ఇట్లు,_
_అట్లాంటా మెగాభిమానులు_