వాజ్‌పేయి తొలి వర్ధంతి సందర్భంగా ప్రముఖుల నివాళి

వాస్తవం ప్రతినిధి: మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ అటల్‌ బిహారీ వాజ్‌పేయి తొలి వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్‌షా తదితరులు ఆయనకు నివాళులర్పించారు. రాజ్‌ఘాట్‌లోని వాజ్‌పేయి స్మారకాన్ని వారు సందర్శించి సమాధిపై పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు. వాజ్‌పేయి కుమార్తె నమితా కౌల్‌ భట్టాచార్య, మనుమరాలు నీహారిక, పలువురు బిజెపి నేతలు నివాళులర్పించారు.