అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

వాస్తవం ప్రతినిధి: హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ గురువారం సంచలన కామెంట్స్ చేశారు. నాథూరాం గాడ్సే అనుచరులు తనను పిస్టల్ తో కాల్చి చంపేయొచ్చని అన్నారు. దేశంలో ఇంకా గాడ్సే అనుచరులు ఉన్నారని చెప్పారు. మహాత్మాగాంధీనే గాడ్సే చంపినప్పుడు.. ఒవైసీని నేను ఎంత అని అసద్ అన్నారు.

కశ్మీర్ ఇష్యూ విషయంలో.. పాకిస్థాన్ అజెండాకు మద్దతు ఇస్తున్నట్టుగా విమర్శలు రావడంపై అసదుద్దీన్ స్పందించాలని మీడియా కోరింది. దీనికి బదులిచ్చిన అసదుద్దీన్ .. అలాంటి విమర్శలు తను చనిపోయేవరకు వస్తూనే ఉంటాయని అన్నారు. మోడీకి వ్యతిరేకంగా మాట్లాడినవాళ్లను యాంటీ నేషనలిస్టుగా, రాజ్యాంగ వ్యతిరేకులుగా ముద్ర వేస్తున్నారని ఆరోపించారు అసదుద్దీన్. “నా దేశం ఇండియా కోసమే నా బాధంతా. నన్ను దేశవ్యతిరేకి అన్నవాళ్లే దేశవ్యతిరేకులుగా భావిస్తా.” అన్నారు అసద్.