రిలీజ్ అవ్వకముందే 300 కోట్లు కలెక్ట్ చేసిన సాహో…?

వాస్తవం సినిమా: ప్రభాస్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సాహో సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల చేసి సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెంచేశారు. పైగా బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన ఈ సినిమాపై దేశవ్యాప్తంగా అంచనాలు భీభత్సంగా ఉండటంతో ఈ సినిమా విడుదల కాకముందే ప్రీ రిలీజ్ బిజినెస్ లో 300 కోట్లు కలెక్ట్ చేసినట్లు ఫిలింనగర్ లో వార్తలు వినపడుతున్నాయి. అయితే ఈ వార్త అధికారికంగా రాకపోయినా సాహో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 330 కోట్లకుపైగా జరిగినట్లు సమాచారం. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ హక్కుల కోసం దాదాపు సాహో సినిమా 125 కోట్లు పలికినట్లు ఇండస్ట్రీ టాక్. ఇక దక్షిణాదిలో విడుదలవుతున్న ఇతర రాష్ట్రాలతో మొత్తం 46 కోట్లు పలకగా బాలీవుడ్ ఇండస్ట్రీ హిందీ వర్షన్ లో 120 కోట్లకు అమ్ముడయినట్లు అలాగే ఓవర్సీస్ లో 42 కోట్లు సినిమా పలికినట్లు రేటు వర్గానికి చెందిన వారు అంచనా వేస్తున్నారు. ఇవి కాకుండా సినిమా శాటిలైట్, డిజిటల్, ఆడియో రైట్స్ రూపంలో భారీ మొత్తం వచ్చే ఛాన్స్ ఉంది. మొత్తంమీద ప్రస్తుతం సాహో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చూసుకుంటే సినిమాకి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా మొత్తం బాహుబలి రికార్డులను మళ్లీ తిరగరాయడం ఖాయం అనే వార్తలు వినబడుతున్నాయి.