శ్రీముఖి ని బాగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..!

వాస్తవం సినిమా: బిగ్ బాస్ హౌస్ లో వాతావరణం చాలా వేడిగా ఉంది. నాలుగో వారంలో కి ఎంటర్ అయిన సందర్భంలో హౌస్ లో ఇంటి సభ్యుల మధ్య బేధాభిప్రాయాలు, గ్రూపులు వ్యక్తిగత అభిప్రాయాలు తారాస్థాయికి చేరి ఒకరిపై ఒకరు విమర్శలు, ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే విధంగా ఇంటిలో వాతావరణం అలుముకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇటీవల హౌస్ లో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో భాగంగా హాట్ యాంకర్ శ్రీముఖి వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతూ ట్రోల్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన టాస్క్ లో భాగంగా కండిషన్స్ అప్లై చేస్తూ శ్రీముఖి మాట్లాడటం పై మండిపడుతున్నారు. గత వారం దొంగల టాస్క్ లో ఎవరైనా తనను ముట్టుకుంటే నచ్చదని స్టేట్మెంట్ ఇచ్చింది. అయితే తాజాగా ఇటీవల జరిగిన ఎపిసోడ్ లో కూడా శ్రీముఖి ఇలానే ప్రవర్తించింది. తనను టచ్ చేయకూడదని రాహుల్ తో చెప్పింది. మిగిలిన ఫిమేల్ కంటెస్టంట్స్ గేమ్ లాగా తీసుకొని స్పోర్టివ్ గా ఆడుతుంటే శ్రీముఖి మాత్రం తనను ఎవరూ ముట్టుకోకూడదని విమెన్ కార్డ్ ప్లే చేస్తుంది. దీంతో సోషల్ మీడియాలో ఆమెని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఫిజికల్ టాస్క్ లు మగాళ్లకు, ఆడవాళ్లకు కలిపే పెడతారనే విషయం శ్రీముఖికి తెలియదా..? ఎవరూ టచ్ చేయకూడదని రూల్స్ పెట్టుకున్న ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వచ్చినట్లు అంటూ ప్రశ్నిస్తున్నారు.