సాహో సినిమా యూనిట్ కి సలహాలు ఇచ్చిన రాజమౌళి..?

వాస్తవం సినిమా: టాలీవుడ్ ఇండస్ట్రీలో డార్లింగ్ ప్రభాస్ కి మరియు దిగ్గజ దర్శకుడు రాజమౌళికి మధ్య స్నేహం వివరించలేనిది అని చాలామంది ఇండస్ట్రీకి చెందిన వారు చెబుతుంటారు. మరియు అదే విధంగా ప్రభాస్ కి తన డైరెక్షన్లో చత్రపతి, బాహుబలి వంటి రెండు భారీ బ్లాక్ బస్టర్ లు ఇచ్చాడు. ముఖ్యంగా బాహుబలి సినిమాతో ప్రభాస్ కి దేశవ్యాప్తంగా నే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి మార్కెట్ ఏర్పడింది. ఆ క్రెడిట్ మొత్తం రాజమౌళి ది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి తరుణంలో బాహుబలి వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ నటించిన సాహో సినిమా విడుదల అవుతున్న క్రమంలో …సాహో సినిమా యూనిట్ కి రాజమౌళి కొన్ని సలహాలు ఇచ్చినట్లు ఫిలింనగర్లో వార్తలు వినబడుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా రన్ టైమ్ మూడు గంటల పైగా ఉందిట. కొన్ని యాక్షన్ సీన్స్ బాగా లెంతీగా ఉన్నాయిట. అవి బోర్ కొట్టే అవకాశం ఉందని భావించిన రాజమౌళి మొహమాటం లేకుండా ట్రిమ్ చేయమని చెప్పారట. అందుతున్న సమాచారం మేరకు రెండు యాక్షన్ ఎపిసోడ్స్ ని ఫుల్ గా ట్రిమ్ చేసారని అంటున్నారు. దాంతో రన్ టైమ్ రెండు గంటల 52 నిముషాలకు వచ్చింది. హెవీ యాక్షన్‌ ఎపిసోడ్లు వున్నాయి కనుక అంత లెంగ్త్‌ పెడితే అదే సినిమాకి మైనస్‌ అవుతుందని రాజమౌళి సూచనలు ఇవ్వడంతో ట్రిమ్ చేసి ఇలా ఫైనల్‌ రన్‌టైమ్‌ తీసుకొచ్చారు. ఈ సినిమా ఈ నెల 31 వ తారీఖు న విడుదల కానుంది.