సైరా సినిమా ప్రమోషన్ కోసం రజనీకాంత్ ని రంగంలోకి దింపుతున్న చరణ్…!

వాస్తవం సినిమా: మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సైరా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు అదిరిపోయే రీతిలో చేయాలని భావిస్తున్నారు ఆ సినిమా నిర్మాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు దాదాపు పూర్తయిన క్రమంలో ప్రమోషన్ కార్యక్రమాలు భారీ ఎత్తున చేపట్టడానికి రామ్ చరణ్ ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కనున్న సైరా సినిమా పై అంచనాలు బీభత్సంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా ట్రైలర్ విషయంలో ఇప్పటికే డైరెక్టర్ సురేందర్ రెడ్డి బిజీ బిజీగా గడుపుతున్న తరుణంలో..బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సినిమా ట్రైలర్ బిగ్ బి అమితాబ్ చేతుల మీదుగా విడుదల చేస్తున్నారు రామ్ చరణ్. ఇదే తరుణంలో తమిళంలో కూడా భారీ స్థాయిలో ఈ సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో తమిళంలో కూడా ప్రమోషన్ కార్యక్రమాలు భారీగా చేయటానికి రామ్ చరణ్ సంచలన ప్లాన్ వేశారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమం కోసం సూపర్ స్టార్ రజినీకాంత్ ని రంగంలోకి దింపితే కచ్చితంగా ‘సైరా’ సినిమాపై హైప్ పెరుగుతుందని, పబ్లిసిటీ బాగా వస్తుందని భావిస్తున్న చరణ్ రజనీకాంత్ ని సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో రంగంలోకి దింపాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు వినపడుతున్నాయి.