ప్రకాశం బ్యారేజీ 70 గేట్ల ఎత్తివేత

వాస్తవం ప్రతినిధి: ప్రకాశం బ్యారేజీ 70 గేట్లను పైకి ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజీలో ప్రస్తుతం 10 అడుగుల నీటి మట్టముంది. తొలుత నీటిమట్టం 12 అడుగులకు చేరితే గేట్లు తెరవాలని అధికారులు భావించినప్పటికీ వరద ప్రవాహం అధికంగా ఉండటంతో ముందుగానే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో దిగువ లంక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రకాశం బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యం 3.05 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 2.5 టీఎంసీల నిల్వ ఉంది. ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీకి వస్తున్న వరద కారణంగా పట్టిసీమ నుంచి వస్తున్న నీటిని నిలిపివేశారు.