హైదరాబాద్ లో నడిరోడ్డుపై దారుణ హత్య!

వాస్తవం ప్రతినిధి: హైదరాబాద్ లో ఫ్యాక్షనిజం పడగవిప్పుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నడిరోడ్లపై కత్తి దాడులు విచ్చలవిడిగా జరిగిపోతున్నాయి. రౌడీలు కత్తులతో వీర విహారం చేస్తున్నారు. ప్రత్యర్థులను అందరూ చూస్తుండగానే హత్యచేసి బాహాటంగానే తిరుగుతున్నారు. తాజాగా బోరబండ సమీపంలోని అల్లాపూర్ లో నర్సింహదాస్ అనే వ్యక్తిని అతిదారుణంగా హత్యచేశారు గుర్తు తెలియని వ్యక్తులు. అర్ధరాత్రి సమయంలో సుమారుగా 20 మంది వ్యక్తులు నర్సింహదాస్ వెంటపడి మరి కత్తులతో డాడి చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. కత్తులు, పలుగు రాళ్లు, గ్రానైట్ రాళ్లతో రౌడీషీటర్ పై దాడి చేసి హతమార్చినట్లుగా తేల్చారు. తీవ్రంగా గాయపడిన నర్సింహదాస్ అక్కడికక్కడే ప్రాణాలు కొల్పోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేపట్టారు. అయితే, మృతుడు నర్సింహదాస్ అలియాస్ పోచి రౌడీషీటర్ గా గుర్తించిన పోలీసులు.. అతనిపై సనత్ నగర్, ఎస్ ఆర్ నగర్ తోపాటు పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లుగా తెలిపారు. పోచీ హత్యకు పాత కక్షలే కారణంగా భావిస్తున్నారు పోలీసులు.