చైనాలో లెకిమా తుపాన్‌ భీభత్సం..39 మంది దుర్మరణం

వాస్తవం ప్రతినిధి: చైనాలో లెకిమా తుపాన్‌ భీభత్సాన్ని సృష్టించింది. చైనాలోని ఝెజియాంగ్‌, షాన్‌డాంగ్‌ అన్హుయి ప్రొవిన్స్‌లు లెకిమా తుపాన్‌ ధాటికి అల్లకల్లోలమయ్యాయి. ఝెజియాంగ్‌ ప్రొవిన్స్‌లో సోమవారం ఒక్క రోజే 39 మంది మరణించారని 9 మంది గల్లంతయ్యారని ప్రొవిన్స్‌లోని వరద నియంత్రణ కేంద్ర కార్యాలయ అధికారులు తెలిపారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. లక్షలాదిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు చెప్పారు.