టీమిండియా హెడ్ కోచ్‌ ఎంపిక ప్రక్రియకు రంగం సిద్దం

వాస్తవం ప్రతినిధి: టీమిండియా హెడ్ కోచ్‌ ఎంపిక ప్రక్రియకు రంగం సిద్దమయింది. కపిల్‌ దేవ్‌, అన్షుమన్‌ గైక్వాడ్‌, శాంత రంగస్వామిలతో కూడిన క్రికెట్‌ సలహా కమిటీ (సీఏవో) ఆధ్వర్యంలో ఈ శుక్రవారం హెడ్ కోచ్ ఎంపిక జరగనుంది. ఈ పదవి కోసం ఎన్నో సంఖ్యలో దరఖాస్తులు వచ్చినా.. అర్హులైన ఆరుగురితో తుది జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పటిదాకా ఎనిమిది మందితో కూడిన జాబితాను సోమవారం సీఏవో ఆరుగురికి కుదించింది. గ్యారీ కిర్‌స్టెన్‌, మహేల జయవర్ధనే రేసు నుంచి అవుటయ్యారు.