తల్లి శ్రీదేవి పుట్టిన రోజు పురస్కరించుకొని కూతురు జాన్వి ట్విట్టర్ లో పెట్టిన సంచలన పోస్ట్..!

వాస్తవం సినిమా: భారతదేశంలో తన అందచందాలతో భారతీయ సినిమా ప్రేక్షకులను అలరించిన అతిలోక సుందరి శ్రీదేవి 54 వ పుట్టిన రోజు ఈ సందర్భంగా శ్రీదేవి పెద్ద కుమార్తె జాహ్నవి కపూర్ తల్లి ని గుర్తు చేసుకుని సోషల్ మీడియాలో సంచలన పోస్టు పెట్టింది. ‘హ్యాపీ బర్త్ డే అమ్మా.. ఐ లవ్యూ’ అని పోస్ట్ చేస్తూ.. శ్రీదేవి నటించిన చివరి సినిమా ‘మామ్’ లోని ఓ ఫోటో అభిమానులతో పంచుకున్నారు.ఈ పోస్ట్ చూసిన అభిమానులు ఎమోషనల్ అయ్యారు. శ్రీదేవిని గుర్తు చేసుకుంటూ మెసేజ్ లు చేస్తున్నారు. అలానే జాన్వీకి ధైర్యం కూడా చెబుతున్నారు. గతేడాది ఫిబ్రవరి 24న శ్రీదేవి దుబాయ్ హోటల్ రూమ్ బాత్ టబ్ లో ప్రమాదవశాత్తు పడి తుదిశ్వాస విడిచారు. శ్రీదేవి పుట్టినరోజు సందర్భంగా బాలీవుడ్ ప్రముఖులు ఆమెతో తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ పోస్ట్ లు పెడుతున్నారు. మరి కొంతమంది అభిమానులు తల్లి లాగానే నువ్వు కూడా సినిమాల్లో బాగా రాణించాలని తండ్రిగా అండగా ఉండాలని జాన్వీ కపూర్ కి ధైర్యం చెబుతూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.