హిట్ అయితేనే లెగుస్తాను లేకపోతే పడుకొని పోతా అంటున్న ప్రభాస్..!

వాస్తవం సినిమా: సాహో సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా మీడియాతో ముచ్చటించిన ప్రభాస్ తన సినిమా రిలీజ్ అయిన సందర్భంలో ఒత్తిడిని తట్టుకోవడానికి తాను ఏం చేస్తాడో మీడియాకి వివరించడం జరిగింది. తనకు చాలా బద్ధకం ఎక్కువ అని అంతేకాకుండా జనాలతో మమేకం కావటానికి చాలా ఇబ్బంది పడతాను అని ప్రభాస్ చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా తమ సినిమా విడుదల అవుతున్న రోజు ఆ రోజు మొత్తం స్నేహితులతో గడపడానికి ప్లాన్ చేసుకుంటా అని ప్రభాస్ తెలిపారు. ఆ ప్లాన్ లో ఎలాంటి మార్పులు ఉండవని.. రిలీజ్ రోజు దాదాపు చచ్చిపోయినంత స్టేజ్ కి వచ్చేస్తానని అన్నారు. అది మార్చుకోవడానికి ప్రయత్నించినట్లు.. ‘రెబల్’ సినిమా ఎలాగైనా ఆడియన్స్ తో కలిసి చూడాలనుకున్నట్లు చెప్పారు. మార్నింగ్ షోకి కూడా బయలుదేరానని.. కానీ మధ్యలోనే డ్రాప్ అయిపోయినట్లు చెప్పారు. ఆ సమయంలో హార్ట్ ఎటాక్ వచ్చినంత పనైందని వెల్లడించారు. తన సినిమా రిలీజ్ రోజు పడుకుంటానని.. హిట్ టాక్ వస్తేనే లేపమని.. లేకపోతే లేపొద్దని స్నేహితులకు చెబుతానని తన వీక్ నెస్ గురించి చెప్పారు. బాహుబలి విషయంలో ఉత్తరాది ప్రేక్షకులను నుండి మంచి టాక్ రాగా తెలుగులో యావరేజ్ టాక్ వచ్చిందని ఆ రోజు అంతా నిద్ర పోయాను దాని తర్వాత రోజుకి సినిమా క్లిక్ అయింది అని ప్రభాస్ చెప్పుకొచ్చారు.