ఓవర్సీస్ లో భారీ డిజార్టర్ దిశగా మన్మధుడు 2..!

వాస్తవం సినిమా: టాలీవుడ్ కింగ్ నాగార్జున కెరీర్లోనే భారీ బ్లాక్ బస్టర్ సినిమా మన్మధుడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రాసిన పంచ్ డైలాగులు ఆ సినిమాలో హైలెట్ అని చెప్పవచ్చు. ఇప్పటి కి ఆ సినిమా టీవీ లో వస్తే చూడకుండా ఎవ్వరు ఉండరు. ఇటువంటి నేపథ్యంలో తాజాగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున మన్మధుడు సీక్వెల్ మన్మధుడు 2 టైటిల్ తో చేసిన విషయం మనకందరికీ తెలిసినదే. అయితే మన్మధుడు సినిమాని దృష్టిలో పెట్టుకుని మన్మధుడు 2 సినిమా చూసిన ప్రేక్షకులు మన్మధుడు సినిమా పరువు తీసేశారని సినిమాలో ఏమీ లేదని సోషల్ మీడియాలో సినిమా చూసిన వారు మన్మధుడు సీక్వెల్ పై తెగ కామెంట్లు పెట్టారు. అయితే ఈ సినిమా ఓవరాల్ గా 18కోట్ల అమ్ముడు పోగా తాజాగా ఈ సినిమాకి వస్తున్న కలెక్షన్లు బట్టి చూస్తుంటే సినిమా కొన్నవారికి సగమైన వస్తుందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. ముఖ్యంగా ఓవర్సీస్ లో సినిమా బొక్క బోర్లా పడింది. వచ్చిన కలెక్షన్లు బట్టి చూస్తుంటే కేవలం రెండు లక్షల డాలర్లను మాత్రమే వసూలు చేసిందని ఇది నాగార్జున కెరీర్ లోనే అతి తక్కువ ఓపెనింగ్ అని అంటున్నారు.ఈ చిత్రం ఓవర్సీస్లో రెండు కోట్లకు పైగానే కొనుగోలు చెయ్యగా ఇంకా అందులో సగం కూడా పూర్తిగా వసూలు కాలేదని తెలుస్తుంది. మొత్తం మీద సినిమాకి వస్తున్న కలెక్షన్లు బట్టి చూస్తుంటే సినిమా ఫుల్లు డిజాస్టర్ అని అందరికీ అర్థమవుతుంది.