అదుపు తప్పి పక్కకు పడ్డ బస్సు.. 14 మంది చిన్నారులకు గాయాలు

వాస్తవం ప్రతినిధి: మహారాష్ట్రలోని పాల్ఘడ్‌ జిల్లా వాడ గ్రామంలో వేగంగా వెళుతున్న ఒక బస్సు అదుపు తప్పి పక్కకు పడిపోయింది. ఈ ఘటనలో 14 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.