భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ పెట్టుబడి గమ్యస్థానంగా మార్చాలన్నదే మా లక్ష్యం : మోదీ

వాస్తవం ప్రతినిధి: భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ పెట్టుబడి గమ్యస్థానంగా మార్చాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్య మని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టంచేశారు. అన్నికోణాల్లో దేశాన్ని వ్యాపారానికి మంచి ప్రాంతంగా మార్చడంలోను, ప్రపంచ అంచనాలను నెరవేర్చడంలోను, దాని సామర్థ్యాన్ని ఘృఆహీంచడంలోను ఏ ఒక్క అవకాశాన్ని విడిచిపెట్టబోమని చెప్పారు. భారతదేశం గురించిన అంచనాలు దేశీయంగానే కాకుండా, ప్రపంచ వృద్ధి, అభివృద్ధి నేపథ్యంలో కూడా మనదేశంపై ఎన్నో ఆశలతో ఉన్నారని చెప్పారు. ఓ జాతీయ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎగుమతులు, విదేశీ పెట్టుబడులు, పునరుజ్జీవనం వంటి అంశాలపై ప్రధాని తన అభిప్రాయాలను పంచుకున్నారు. అనేక సందేహాలకు, సమస్యలకు సావధానంగా జవాబుచెప్పారు.

ఆటోమొబైల్‌ రంగం, డేటా రక్షణ నపంచి జమ్మూ కాశ్మీర్‌లో అవకాశాల వరకు ఆయన ప్రస్తావించారు. ఆర్టికల్‌ 370 రద్దుచేస్తూ, ఇటీవల తీసుకున్న నిర్ణయం తరువాత, ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఇప్పటికే జమ్మూ కాశ్మీర్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారని మోడీ చెప్పారు. మూసివేసిన వాతావరణంలో ఆర్థిక వృద్ధి జరగదని, ఏకీకరణ ద్వారా పెట్టుబడి, ఆవిష్కరణ, ఆదాయాలు పెరుగుతాయని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ల డాలర్ల వ్యవస్థగా ఎలా మారుస్తారన్న విజన్‌ను ఆయన వెల్లడించారు.