ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై సెటైర్లు వేసిన చంద్రబాబు..!

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలలో తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులకు చుక్కలు చూపించిన నేత వైసిపి లో ఎవరైనా ఉన్నారు అంటే అది నెల్లూరు జిల్లాకు చెందిన ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అని నిర్మొహమాటంగా చెప్పవచ్చు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు కి నారా లోకేష్ కి దిమ్మతిరిగి పోయే విధంగా అసెంబ్లీ సమావేశాలలో విమర్శలు చేసి గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అవినీతి మొత్తం బయట పెడుతూ చాటింగ్ కామెంట్ చేశారు అనిల్ కుమార్ యాదవ్. ఇటువంటి నేపథ్యంలో తాజాగా చంద్రబాబు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై సెటైర్లు వేశారు. ఈ క్రమంలో చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు ఉద్దేశించి మాట్లాడుతూ పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టడం అంటే బెట్టింగ్ కట్టినంత అంత ఈజీ కాదు అంటూ అనిల్ కుమార్ యాదవ్ పై స్ట్రాంగ్ కౌంటర్ లు వేశారు. కాఫర్ డ్యామ్ నిర్మాణం వల్లే గ్రామాలు మునిగిపోయాయి అంటూ కొత్తగా ఇరిగేషన్ పాఠాలు చెబుతున్నారని మంత్రులను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. ఈ మేరకు సోమవారం ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ప్రతి అంశంలో టెక్నికల్ కమిటీలు ఉంటాయని కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణ తో పాటు పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీడ బ్ల్యూసీ నిబంధనల ప్రకారం నిర్మాణం ఉంటుందని పేర్కొన్నారు. ఎంతో అనుభవం ఉన్న ఇంజనీర్లు మేధావులు డిజైన్లు రూపం ఇస్తారని ఈ విషయాలన్నీ ప్రస్తుతం ఉన్న నాయకులు తెలుసుకోవాలని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఇదే క్రమంలో భారీ వర్షాలు, వరద వచ్చినా సందర్భాలలో వరద ముప్పు కు గురయ్యే ప్రాంతాలను కాళి చేయించకుండా ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తుందని చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు.