జగన్ తీసుకున్న ఆ నిర్ణయం వల్లే తెలుగుదేశం పార్టీ ఏపీ లో ఉంది..?

వాస్తవం ప్రతినిధి: తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి ప్రధాన పార్టీ గా గతంలో రాణించింది. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా చీలిపోయిందో ఆ సమయంలో తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జరిగిన ఎన్నికల్లో ఓ మాదిరి స్థానాలు గెలిచినా రెండోసారి జరిగిన ఎన్నికల్లో కనుమరుగయ్యే స్థాయికి పడిపోయింది. ఇదే క్రమంలో విభజన జరిగిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చిన టీడీపీ రెండోసారి జరిగిన 2019 ఎన్నికల్లో కేవలం ఇరవై మూడు స్థానాలకు పడిపోయింది. ఇక పార్లమెంటు స్థానాలు కేవలం మూడే మూడు స్థానాలకు పరిమితమైంది. ఈ క్రమంలో అధికారంలో ఉన్నా వైసిపి పార్టీ ఇంత దారుణంగా దెబ్బ తిన్న తెలుగుదేశం పార్టీని రెండు తెలుగు రాష్ట్రాలలో లేకుండా చేయాలంటే నిమిషంలో పని అని కానీ జగన్ విలువైన నీతివంతమైన రాజకీయాలు చేయడం వల్లే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ మిగిలివుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ముఖ్యంగా తన పార్టీ లోకి రావాలి అంటే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కచ్చితంగా రాజీనామా చేసి రావాలని జాగ్రత్త విధించడంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు వైసీపీ లోకి వెళ్ళటానికి కొంత సందేహిస్తూన్నట్లు దీన్ని బట్టి అర్థమవుతోంది. అయితే మరోపక్క బిజెపి మాత్రం తెలుగుదేశం పార్టీలో ఉన్న వారిని రాజీనామా చేసి రావాలని ఎలాంటి షరతులు పెట్టకపోవడంతో టిడిపిలో ఉన్న చాలామంది నాయకులు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు. ఏదిఏమైనా అధికారంలో ఉన్న వైసిపి పార్టీ అధినేత జగన్ పెట్టిన షరతు వల్లే టీడీపీ ఇప్పటికీ ఆంధ్రాలో మిగిలివుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.