ప్రధాని నరేంద్ర మోడీకి ముద్రగడ పద్మనాభం లేఖ !

వాస్తవం ప్రతినిధి: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. 02.12.2017న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపిన 33/2017 కాపు రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. గత యాభై సంవత్సరాలుగా ఆంధ్రాలో రాజకీయ పక్షాలు తమ ఓట్లు పొంది రిజర్వేషన్ విషయంలో మోసం చేశారని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. చంద్రబాబు కాపులకు ఇచ్చిన 5% బీసీ రిజర్వేషన్ బిల్లు కేంద్ర హోంశాఖ వద్ద పెండింగ్‌లో ఉందని గుర్తు చేశారు. తక్షణం బిల్లును ఆమోదించి కాపు రిజర్వేషన్ అమలుకు కేంద్రం సహకరించాలని లేఖలో మోడీకి ముద్రగడ విజ్ఞప్తి చేశారు.