నేను శ్రీ రాముడి ముని మనవరాలిని: బీజేపీ ఎంపీ దియా కుమారి

వాస్తవం ప్రతినిధి: అయోధ్యలో రామమందిర నిర్మాణంపై సుప్రీంకోర్టులో ఉన్న కేసుకు ఆధారాలు సమర్పిస్తానని.. తాను శ్రీరాముడి వంశానికిని చెందిన వ్యక్తినని బీజేపీ ఎంపీ – జైపూర్ రాచకుటుంబ సభ్యురాలు దియా కుమారి పార్లమెంటు సభ్యురాలు ప్రకటించారు. తనది శ్రీరామ చంద్రుడి కుమారుల్లో ఒకరైన కుశుడి వంశమని ఆమె ప్రకటించుకున్నారు. ఆమె భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ కావడంతో ఎప్పటిలానే విపక్షాలు విమర్శలు మొదలుపెట్టాయి. శ్రీరాముడి మునిమనమరాలు భారత పార్లమెంటులో ఉందంటూ విమర్శలు చేస్తున్నారు.

అయోధ్య-బాబ్రీ మసీదు కేసు విచారణ సందర్భంగా… రాముడి రఘువంశానికి చెందినవారు ఎవరైనా ఇప్పటికీ అయోధ్యలో ఉన్నారా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీనికి సమాధానంగా తమ కుటుంబం కుశుడి వారసత్వమేనని దియా కుమారి వ్యాఖ్యానించారు. రాముడి వారసులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారని ఆమె తెలిపారు. అయోధ్య వివాదాన్ని త్వరగా పరిష్కరించాలని కోరారు.