తెలుగుదేశం పార్టీ వారికి రాష్ట్రంలో జీవించే హక్కు లేదా..?: చంద్రబాబు

వాస్తవం ప్రతినిధి: తెలుగుదేశం పార్టీ వారికి రాష్ట్రంలో జీవించే హక్కు లేదా అని తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. తెలుగుదేశం సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతున్నారు. వైకాపా శ్రేణులు తెలుగుదేశం కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారనీ, ఆ దాడులపై ఫిర్యాదు చేస్తే పోలీసులు మనవాళ్లపైనే కేసులు పెడుతున్నారని చంద్రబాబు చెప్పారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు తాము ఎలా వ్యవహరించామో వారికి గుర్తు లేదా అని ప్రశ్నించారు. అప్పుడు మనం వైకాపాలా వ్యవహరించి ఉంటే ఆ పార్టీ ఉండేదా అని ప్రశ్నించారు.