శిఖర్ ధావన్, రిషబ్ పంత్‌పై నెటిజన్లు విమర్శలు

వాస్తవం ప్రతినిధి: వెస్టిండీస్ పర్యటనలో పేలవ షాట్స్ ఆడి ఔటైన ఓపెనర్ శిఖర్ ధావన్, రిషబ్ పంత్‌పై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. నిన్న జరిగిన రెండో వన్డేలో ధావన్ (2: 3 బంతుల్లో), రిషబ్ పంత్ (20: 35 బంతుల్లో 2×4) చేజేతులా తమ వికెట్లను చేజార్చుకున్నారు.

మరోవైపు ఓపెనర్ శిఖర్ ధావన్ ఇటీవల జరిగిన టీ20 సిరీస్‌లో వరుసగా 1, 23, 3 పరుగులతో నిరాశపరిచిన విషయం తెలిసిందే. అటు మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని స్థానంలో జట్టులోకి వచ్చిన రిషబ్ పంత్ ఆఖరి టీ20లో మెరిసినా.. రెండో వన్డేలో మళ్ళీ తేలిపోయాడు. దూకుడైన షాట్ కోసం ప్రయత్నించి బ్రాత్‌వైట్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీనితో వీరిద్దరికి ఎన్నిసార్లు అవకాశాలు ఇచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు.. వారి స్థానంలో కొత్తవాళ్లకు అవకాశం ఇస్తే బాగుంటుందని నెటిజన్లు తమ అభిప్రాయాల్ని ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేస్తున్నారు.