సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విజయశాంతి పిక్..!

వాస్తవం సినిమా: మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ఫస్ట్ లుక్ ఇంట్రడక్షన్ టీజర్ ఇటీవల మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదలైన సంగతి మనకందరికీ తెలిసినదే. ఈ సినిమాలో దాదాపు 13 సంవత్సరాల తర్వాత రీల్ ఎంట్రీ ఇస్తుంది సీనియర్ హీరోయిన్ విజయశాంతి. ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ లో ఇటీవల విజయశాంతి పాల్గొనడంతో ఆమె షూటింగ్లో పాల్గొన్న ఫోటో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో బయటకు వచ్చింది. ఈ ఫోటోని సరిలేరు నీకెవ్వరు డైరెక్టర్ అనిల్ రావిపూడి సోషల్ మీడియా లో విడుదల చేశారు. దాదాపు 13 ఏళ్ల తరువాత విజయశాంతి మేకప్ వేసుకున్నట్లు చెబుతూ.. ఈ 13 ఏళ్లలో ఆమెలో ఏ మాత్రం మార్పు రాలేదని, సేమ్ డిసిప్లేన్ – సేమ్ ఆటిట్యూడ్ అని పేర్కొన్నారు. అలాగే ఆమె చైతన్యంలో కూడా ఎలాంటి తేడా కనిపించలేదని ‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్ లోకి ఆమెను ఆనందంగా ఆహ్వానిస్తున్నట్లు దర్శకుడు తెలియజేశాడు. సూపర్ స్టార్ అభిమానులు విజయశాంతి ఫోటోలను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.