విలన్ ని చేసిన నటుడితో సినిమా చేయబోతున్న డైరెక్టర్ తేజ..!

వాస్తవం సినిమా: డైరెక్టర్ తేజ ఉదయ్ కిరణ్, నితిన్ వంటి హీరోలను సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేసి అద్భుతమైన హిట్లు అందుకుని అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలోనే స్టార్ డైరెక్టర్ గా ఓ వెలుగు వెలిగాడు. ఇటువంటి తరుణంలో వరస పరాజయాలు డైరెక్టర్ తేజ కి రావడంతో చాలాకాలం సతమతమైన తర్వాత రానాతో ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా తీసి అద్భుతమైన హిట్ అందుకున్నాడు. అయితే ఆ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన సీత సినిమా లేకపోవడంతో డైరెక్టర్ తేజ తో సినిమా చేయడానికి చాలామంది ముందుకు రాలేకపోయారు. ఇటువంటి తరుణంలో జయం సినిమాలో గోపీచంద్ ని విలన్ గా చూపించి మంచి సక్సెస్ అందించి దాదాపు హీరోకు సమానంగా పేరు వచ్చేలా చేశాడు డైరెక్టర్ తేజ. అయితే ఇప్పుడు గోపీచంద్ కెరియర్ డేంజర్ జోన్ లో ఉండటంతో సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో గోపీచంద్ తో కలిసి డైరెక్టర్ తేజ ఓ సినిమా చేయటానికి రెడీ అయినట్లు ఫిలింనగర్లో వార్తలు వినబడుతున్నాయి. అయితే ఈ సినిమా యాక్షన్ సినిమా తరహాలో ఉంటుంది దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ చేసే పనిలో డైరెక్టర్ తేజ నిమగ్నమైనట్లు సమాచారం. ప్రస్తుతం గోపీచంద్ చాణక్య అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా అయిన వెంటనే డైరెక్టర్ తేజ సినిమాలు నటించడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.