జైలులో ఉన్న రిమాండ్ ఖైదీ ఆత్మహత్య

వాస్తవం ప్రతినిధి: జైలులో ఉన్న రిమాండ్ ఖైదీ ఆత్మహత్య చేసుకున్న సంఘటన న్యూయార్క్ లో సంచలనం కలిగించింది. ఆ ఖైదీకి ప్రముఖులతో పరిచయాలున్నాయి. బాలికల విక్రయం, వేధింపులు వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారి జెఫ్రీ ఎప్‌స్టీన్ ‌(66) జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు.

బాలికలను, ముఖ్యంగా 14 ఏళ్లలోపు వారిని విక్రయిస్తున్నాడన్న ఆరోపణలపై అతడు ప్రస్తుతం మన్‌హట్టన్‌లోని మెట్రోపాలిటన్‌ కరెక్షనల్‌ జైలులో ఉన్నాడు. ఎప్‌స్టీన్‌ గతంలో ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్, మాజీ అధ్యక్షుడు క్లింటన్, బ్రిటన్‌ యువరాజు ఆండ్రూ వంటి పలువురు రాజకీయనేతలు, సెలబ్రిటీలతో సన్నిహిత సంబంధాలు సాగించేవాడు. మన్‌హట్టన్, పామ్‌బీచ్‌లలోని తన నివాసాల్లో 2002–2005 మధ్య టీనేజీ బాలికలను వాడుకోవడం, విక్రయించడం వంటి చర్యలకు పాల్పడినట్లు అతడిపై ఆరోపణలు వచ్చాయి.