ఢిల్లీ-లాహోర్ బస్సు సేవలను నిలిపివేసిన పాక్

వాస్తవం ప్రతినిధి: జమ్ముకశ్మీర్‌కు ఇప్పటి వరకు ఉన్న స్వయం ప్రతిపత్తిని రద్దు చేసి కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టిన తర్వాత గుర్రుగా ఉన్న పాకిస్థాన్.. భారత్‌తో సంబంధాలను తెంచుకుంటూ పోతోంది. తొలుత ద్వైపాక్షిక సంబంధాలను, ఆ తర్వాత వాణిజ్యాన్ని తెగదెంపులు చేసుకుంది. అటు తర్వాత సంఝౌతా ఎక్స్‌ప్రెస్ రైలు సేవలను నిలిపివేసింది. ఆ తర్వాత థార్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులను రద్దు చేసింది. తాజాగా, ఢిల్లీ-లాహోర్ మధ్య నడిచే బస్సు సేవలను కూడా నిలిపివేసింది. ఈ మేరకు పాక్ మంత్రి మురాద్ సయీద్ పేర్కొన్నారు.