జమ్మూలో సాధారణ పరిస్థితులు

వాస్తవం ప్రతినిధి: జమ్మూలో సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే 144 సెక్షన్ ఎత్తేశారు. ఇవాళ జమ్మూ ఏరియాలో స్కూళ్లు తెరచుకున్నాయి. జమ్మూ జిల్లా డిప్యూటీ మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేయడంతో విద్యా, వాణిజ్య సంస్థలు తెరుచుకునేందుకు అవకాశం ఏర్పడింది.

మరోవైపు పరిస్థితులు, ఆందోళనలు కూడా లేకపోవడం, నిత్యావసరాలు అవసరం పడుతుండడంతో జనం బయటకు వస్తున్నారు. అయితే కశ్మీర్ లోయలో మాత్రం 144 సెక్షన్ ఎత్తేయడానికి ఇంకా టైమ్ పడుతుందని చెబుతున్నారు. జమ్మూలో పరిస్థితి ప్రశాంతంగా ఉందని, కశ్మీర్ వ్యాలీలో పరిస్థితి అదుపులోనే ఉందంటున్నారు పోలీసులు. శుక్రవారం ప్రార్థనలు ప్రశాంతంగా ముగియడంతో త్వరలోనే లోయలోనూ శాంతియుత వాతావరణం నెలకొంటుందని చెబుతున్నారు. ఉధంపూర్, కతువా వంటి ప్రాంతాల్లో నిన్ననే స్కూల్స్ ఓపెన్ అయ్యాయి.