కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరునికి ఓ ఎన్నారై భక్తుడు భారీ విరాళం

వాస్తవం ప్రతినిధి: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరునికి ఓ ఎన్నారై భక్తుడు భారీ విరాళాన్ని అందించాడు. ఇవాళ (శుక్రవారం) ఉదయం తిరుమలకు వచ్చిన ఆ భక్తుడు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని కలిసి రూ. 14 కోట్ల చెక్ ను స్వామివారికి కానుకగా అందించారు. టీటీడీ ఈ డబ్బును భక్తుల సంక్షేమం కోసం ఉపయోగించాలని ఆయన కోరారు.

తన పేరు బయటకు చెప్పకూడదని ఆ ఎన్నారై కోరడంతో… అధికారులు రసహ్యంగా ఉంచారు. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శ్రావణ శుక్రవారం కావడం, వరుస సెలవులు రావడంతో స్వామి దర్శనానికి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మరోవైపు తిరుచానూరు పద్మావతి అమ్మవారికి ఇవాళ ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి.