నారా లోకేష్ కి చుక్కలు చూపించిన వరద బాధితులు..!

వాస్తవం ప్రతినిధి: టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ను ఏమాత్రం రాజకీయ నేతగా గుర్తించకుండా మంగళగిరి ప్రజలు ఓడించడం తో ఇప్పుడు రాష్ట్ర ప్రజల అభిమానాన్ని పొందడానికి నానా తంటాలు పడుతున్నారు నారా లోకేష్. నారా లోకేష్ కి ఇటీవల వరద బాధితులు చుక్కలు చూపించారు. వరద బాదితులను పరామర్శ చేయడానికి వెళ్లిన మాజీ మంత్రి ,టిడిపి నేత లోకేష్ కు ఇబ్బందికర ప్రశ్నలు ఎదురు అయ్యాయి.పునరావాస పనులు చేపట్టకుండా కాపర్ డామ్ నిర్మించినందువల్లే తమకు ఈ ముంపు బాద వచ్చిందని పలువురు మహిళలు లోకేష్ వద్ద వ్యాఖ్యానించారు.దాంతో వారికి సర్దిచెప్పడానికి టిడిపి నేతలు ఇబ్బంది పడ్డారు.

నిర్వాసితులకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ, పునరావాసం కల్పించకుండా మీ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టులో కాఫర్‌ డ్యామ్‌ నిర్మించారు, మీరంతా బాగానే ఉన్నారు, వరదల్లో మేము నానా కష్టాలు పడుతున్నాం’’ అని వరద బాధితులువాపోయారు. నారా లోకేష్‌ గురువారం టీడీపీ ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, అప్పారావుతో కలిసి తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం వరద ప్రభావిత ప్రాంతంలో పర్యటించారు. లోకేష్‌ స్పందిస్తూ.. కాఫర్‌ డ్యామ్‌ వద్ద ఖాళీ వదిలిపెట్టామని చెప్పారు. ఆయన సమాధానంపై వరద బాధితులు సంతృప్తి చెందలేదు.