అత్తి వరదరాజస్వామి దర్శనం కోసం పోటెత్తిన భక్తులు

వాస్తవం ప్రతినిధి: అత్తి వరదరాజస్వామి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. కంచిలో కొలువై ఉన్న అత్తి వరదరాజస్వామి నాలుగు దశాబ్దాలకు ఒక సారి కేవలం 40 రోజులు మాత్రమే భక్తులకు దర్శనమిస్తారు. మిగిలిన కాలమంతా కోనేటి గర్భంలోనే స్వామి వారి విగ్రహం ఉంటుంది. చివరి సారిగా గతంలో 1979లో భక్తులకు దర్శనమిచ్చిన అత్తి వరదరాజస్వామి దర్శనానికి ఈ ఏడాది జూన్ నుంచి ప్రజలకు ఆలయ నిర్వాహకులు అనుమతి ఇచ్చారు. ఈ నెల 17వరకూ మాత్రమే స్వామి వారి దర్శనానికి అవకాశం ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు.