ఎల్‌ఒసి వద్ద భారీగా ఉగ్రవాదులను నియమిస్తున్న పాక్

వాస్తవం ప్రతినిధి: జమ్ము కాశ్మీర్‌లోకి ఉగ్రవాదులను పంపించడానికి పాకిస్తాన్‌ గత కొద్ది రోజులుగా ప్రయత్నాలు ఆరంభించింది. నియంత్రణాధీన రేఖ (ఎల్‌ఒసి) వద్ద ఉన్న ల్యాంచ్‌ప్యాడ్స్‌లో భారీగా ఉగ్రవాదులను నియమిస్తోందని ఒక ఆర్మీ అధికారి చెప్పారు . కాగా నార్తన్‌ కమాండ్‌ జనరల్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ చీఫ్‌లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ రణబీర్‌ సింగ్‌ మాట్లాడుతూ పాకిస్తాన్‌ కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులు జరుపుతోందని అన్నారు.