త్వరలోనే ఎన్నికలు జరుగుతాయి..సిద్దం కండి: కుమారస్వామి

వాస్తవం ప్రతినిధి: కర్ణాటకలో యడియూరప్ప నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఎక్కువకాలం కొనసాగదని మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్.డి.కుమారస్వామి తెలిపారు. కర్ణాటక అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరుగుతాయని వ్యాఖ్యానించారు. ఇటీవల అనర్హతవేటుకు గురైన 17 నియోజకవర్గాల్లో త్వరలో ఉపఎన్నికలు రాబోతున్నాయనీ, కాబట్టి జేడీఎస్ కార్యకర్తలంతా అందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. కర్ణాటకలోని మాండ్య జిల్లా కేంద్రంలో ఈరోజు జరిగిన జేడీఎస్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్ణాటకలోని మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకూ ఎన్నికలు జరగవచ్చని కుమారస్వామి చెప్పారు.