కులభూషణ్ ను కలుసుకోవడానికి భారత అధికారులకు అనుమతి

వాస్తవం ప్రతినిధి: కులభూషణ్ జాదవ్ అక్రమంగా పాక్ లోకి ప్రవేశించారని చెప్పి ఆయన్ను పాక్ ప్రభుత్వం 2016 లో అదుపులోకి తీసుకొని విచారించి మరణశిక్ష విధించింది. దీనిని భారత్ ఖండించిన సంగతి తెలిసిందే. నావికాదళ అధికారి పదవీవిరమణ తరువాత జాదవ్ ఇరాన్ లో వ్యాపారం చేసుకుంటున్నారని, పాక్ అక్రమంగా ఆయన్ను పట్టుకొని గూఢచౌర్యం కేసును పెట్టి మరణశిక్ష విధించిందని వాదించింది. భారత్ ఐసీజే లో కేసు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

సుదీర్ఘ విచారణ అనంతరం కులభూషణ్ జాదవ్ మరణ శిక్షను రద్దు చేసింది. కాగా, ఐసీజే తీర్పుకు అనుగుణంగా పాక్ ప్రభుత్వం కులభూషణ్ ను కలుసుకోవడానికి భారత అధికారులకు అనుమతిని ఇచ్చింది. అయితే, దీనిపై భారత ప్రభుత్వం స్పందించాల్సి ఉన్నది.