సిద్ధార్థ రాసిన నోట్‌పై మాల్యా సంచలన వ్యాఖ్యలు

వాస్తవం ప్రతినిధి: కేఫీ కాఫీ డే వ్యవస్థాపకుడు సిద్ధార్థ పరిస్థితే తనది కూడా అని బ్యాంకులను వేల కోట్లు మోసం చేసి పరారైన మద్యం వ్యాపారి విజయ్‌మాల్యా అన్నారు. సిద్ధార్థ రాసిన నోట్‌పై మాల్యా స్పందించారు. సిద్ధార్థ లేఖ తనను కలవరపరిచిందని మాల్యా చెప్పారు. తీసుకున్న మొత్తం తిరిగి చెల్లిస్తానని చెప్పినా బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థలు తనపట్ల దుర్మార్గంగా ప్రవర్తించాయని ఆయన అన్నారు. పాశ్చాత్య దేశాల్లో బ్యాంకులు రుణం తీసుకున్న వారికి రుణం తీర్చడానికి ప్రభుత్వాలు సహాయం చేస్తాయని ఆయన అన్నారు. కానీ తన విషయంలో దీనికి విరుద్ధంగా జరిగాయని ఆయన అన్నారు.