హిమదాస్‌ కు ప్రధాని మోదీ అభినందనలు!

వాస్తవం ప్రతినిధి: భారత స్టార్ అథ్లెట్ హిమదాస్‌ను ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసించారు. హిమదాస్‌ను చూసి భారత అభిమానులు మురిసిపోతున్నారని చెప్పారు. ట్విట్టర్ వేదికగా ఆమెకు అభినందనలు తెలిపారు. పరుగుల తార హిమదాస్ ఐదు స్వర్ణాలు సాధించి రికార్డు సృష్టించిందన్నారు.

గత కొన్ని రోజులుగా అద్భుతంగా రాణిస్తున్న హిమదాస్‌ను చూసి దేశం గర్విస్తోంది. దేశం తరపున ఐదు గోల్డ్ మెడల్స్ సాధించినందుకు ఆమెను చూసి అందరూ సంతోషిస్తున్నారు. ఆమెకు అభినందలు. భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.