కలెక్టర్ ల పై సీరియస్ అయిన జగన్…?

వాస్తవం ప్రతినిధి: తనపై ఎంతో నమ్మకంతో భారీ మెజార్టీతో ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి పాలన అందించడానికి నిరంతరం కృషి చేస్తున్నారు ఏపీ సీఎం జగన్. దీంతో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ అధికారులతో కలెక్టర్ లతో ప్రజలకు అధికారులుగా కాకుండా సేవకులుగా ప్రతి ఒక్కరు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎక్కడ కూడా అవినీతి లేకుండా సామాన్యులకు న్యాయం చేసే దిశగా ప్రతి ఒక్కరు ఈ ప్రభుత్వంలో భాగస్తులు కావాలని జగన్ ముందు నుండే చెబుతూ వచ్చారు. ముఖ్యంగా తన పాదయాత్రలో ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన నవరత్నాల హామీలను కచ్చితంగా రాష్ట్రంలో అమలు చేయాలని కలెక్టర్ల తొలి సమావేశంలో జగన్ తెలియజేశారు. అయితే తాజాగా ఇటీవల రెండోసారి కలెక్టర్ల సమావేశంలో జగన్ కలెక్టర్ల పై సీరియస్ అయినట్లు సమాచారం. దానికి కారణం జగన్ చెప్పిన పనిని అధికారులు చేయలేదని తెలుస్తుంది. అధికారులు చేయలేకపోవటానికి అసలు కారణం ఏమిటంటే నిధులు లేకపోవటమే, జగన్ అధికారంలోకి రావటానికి దోహదం చేసినవి “నవరత్నాలు”. వాటిని ఎట్టి పరిస్థితుల్లో అయిన అమలుచేయాలనే ఒకే ఒక లక్ష్యంతో జగన్ పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే వాటికి సరిపడినంత బడ్జెట్ అనేది అందుబాటులో లేదనేది వాస్తవం. అయిన సరే వాటిని ఎలాగైనా అమలు చేసి తీరాలి, అందుకు తగ్గట్లు ప్రణాళికలు సిద్ధం చేయండని చూచించారు. వాటిపై కలెక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో జగన్ సీరియస్ అయినట్లు సమాచారం.