అనంతపురం లో APTA ఆధ్వర్యంలో కుట్టు మిషన్ ల పంపిణీ కార్యక్రమం

వాస్తవం ప్రతినిధి: పేద  విద్యార్దులకు  చదువు తో పాటుగా వృత్తి విద్యల్లో కూడా ప్రావీణ్యం పొందడానికి అవసరమయ్యే సహాయాన్ని అందించడానికి   అండగా ఉంటుందని మరో సారి నిరూపించింది APTA.(అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్).

అనంతపురం జిల్లా ధర్మవరం వద్ద గల సి కె పల్లె గ్రామంలో APTA   కుట్టు మిషన్ ల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. కస్తూరిబా పాఠశాల విధ్యార్దినులు ఉపాద్యాయినులచే టైలరింగ్ విభాగంలో ప్రావీణ్యత పొందడానికి ఈ కుట్టు మిషన్ ల పంపిణీ జరిగింది.

 ఈ టైలరింగ్ యంత్రాలను మహిళా డైరెక్టర్లు AWEP బృందం(2017-18) స్పాన్సర్ చేసింది. మరియు లాజిస్టిక్స్ APTA ఇండియా ఆపరేషన్స్ బృందం (2017-18) సమన్వయం చేసింది .

ఆప్త సంస్ఠ తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న అనేక సేవా కార్యక్రమాల్లో  ఇది ఒక భాగం అని , ఇలాంటి అనేక ఇతర కార్యక్రమాలు తమ సంస్థ ప్రతి ఏట నిర్వహిస్తుందని ఆప్త అధ్యక్షులు శ్రీ నటరాజు ఇల్లూరి తెలియచేసారు.

ఈ సందర్భంగా ఆప్త సేవా కార్యక్రమాల్లో అవిశ్రాంతంగా పనిచేస్తున్న ఆప్త కార్యకర్తలకు తన అభినందనలు తెలియచేసారు.